TSPSC Group 2 Recruitment 2023 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అప్లికేషన్లు నేటి నుంచి మొదలవనున్నాయి. అందుకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ కూడా టీఎస్పీఎస్సీ ఈ రోజే రిలీజ్ చేయనుంది. రెండు వారాల కిందటే గ్రూప్ 2 వెబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 783 ఖాళీల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 18 నుంచి గ్రూప్ 2 అప్లికేషన్ల నమోదు మొదలవుతుంది. ఫిబ్రవరి 16వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్ చూడొచ్చు.
TSPSC Group 2 పోస్టులు:
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 – 11
- అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ – 59
- డిప్యూటీ తహసీల్దార్ (నాయిబ్ తహసీల్దార్) – 98
- సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 – 14
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ (కో–ఆపరేటివ్ సబ్ సర్వీసెస్) – 63
- అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ – 09
- ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (మండల పంచాయతీ అధికారి) – 126
- ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ – 97
- అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్) – 38
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(జనరవ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) – 165
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ – 15
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ – 25
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్ మెంట్ – 07
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ – 02
- డ్రిస్టిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (జువైనల్ కరెక్షనల్ సర్వీస్) – 11
- అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్) – 17
- అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ట్రైబల్ వెల్ఫేర్ సబ్ సర్వీస్) – 09
- అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఎస్సీడీడీ సబ్ సర్వీస్) – 17
అర్హతలు:
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్ మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
REMINDER
గ్రూప్ 2 అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 18 నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
గ్రూప్ 3 దరఖాస్తులు జనవరి 24 నుంచి మొదలవుతాయి. ఫిబ్రవరి 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
గ్రూప్ 4 అప్లికేషన్లకు జనవరి 30వ తేదీ వరకు తుది గడువు ఉంది.
