సిలబస్ సేమ్ ఉండడంతో.. గ్రూప్-2 గట్టిగా ప్రిపేరయితే అభ్యర్థులు గ్రూప్-3 సులభంగానే సాధించ వచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలో సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది. కామన్ ప్రిపరేషన్‌తో రెండు ఉద్యోగాలు సాధించే ఛాన్స్ ఉంది. అందుకు ఎలా ప్రిపేర్ కావాలి.. ఎలా చదవాలి.. ఏమేం కామన్ ఉన్నాయి..? తెలుసుకుందాం.
REMINDER
గ్రూప్ 2 అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 18 నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
గ్రూప్ 3 దరఖాస్తులు జనవరి 24 నుంచి మొదలవుతాయి. ఫిబ్రవరి 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
గ్రూప్ 4 అప్లికేషన్లకు జనవరి 30వ తేదీ వరకు తుది గడువు ఉంది.
- గ్రూప్ 2 పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు. ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
- గ్రూప్ 3 లో మూడు పేపర్లు ఉండగా, ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే టీఎస్పీఎస్సీలో గ్రూప్ 2, 3 పరీక్షలో 60శాతం మార్కులు సాధిస్తే కొలువు సాధించవచ్చు.
- గ్రూప్ 2, 3 సిలబస్ దాదాపు సమానమే కాని, ముఖ్యమైన తేడా గ్రూప్ 2 లో తెలంగాణ ఉద్యమం నుంచి 150 మార్కులు ఉంటే, గ్రూప్ 3 లో పేపర్ 2 లో భాగంగా ఉంటుంది. గ్రూప్ 3లో తెలంగాణ ఉద్యమంలో 30 నుంచి 40 మార్కులు వచ్చే అవకాశం ఉంది.
పేపర్ 1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)
- సిలబస్ ప్రకారం ఇందులో మొత్తం 11 టాపిక్‌లు ఉన్నాయి. సిలబస్ ఎక్కువ కావటంతో దీని ప్రిపరేషన్‌కు ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. అందుకే మిగతా పేపర్లు చదివిన తర్వాతే, పేపర్ 1 ప్రిపరేషన్ మొదలు పెట్టాలి.
- గ్రూప్ 2, 3 రెండు ఎగ్జామ్స్‌లోనూ పేపర్ 1 సిలబస్‌లో సేమ్ టాపిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లిష్ , అర్థమెటిక్ అండ్ రీజనింగ్, డేటా ఇంటర్ ప్రిటేషన్ పై ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంగ్లిష్, మెంటల్ ఎబిలిటి నుంచి సుమారు 40 నుంచి 50 మార్కుల మధ్య వచ్చే అవకాశం ఉంది. వీటి మీద కొంచెం ఎక్కువ దృష్టి పెడితే మొదటి పేపర్లో మంచి మార్కులు సాధించవచ్చు.
- తెలంగాణ రాష్ట్ర పాలసీలు తెలంగాణ ఎకానమీలోనూ కవర్ అవుతాయి. సోషల్ ఎక్సూక్లూజన్, రైట్ ఇష్యూస్ మరియు ఇన్‌క్లూజన్ పాలసీలు పాలిటీలో భాగంగా ఉంటాయి.
- తెలంగాణ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, కళలు, సాహిత్యానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి చెందినవి రెండో పేపర్లో పూర్తిగా కవర్ అవుతాయి.
- ఇండియా హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ సిలబస్ దాదాపు పేపర్ 1తో పాటు పేపర్ 2లో భాగంగా ఉంటాయి. అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, సంబంధాలు, సంఘటనలు దాదాపు ఒక దానికొకటి లింక్ ఉంటాయి.
- వరల్డ్ జాగ్రఫీకి సమకాలిన అంశాలు చదివితే సరిపోతుంది. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి అట్లాస్‌పై ఫోకస్ చేయాలి. తెలంగాణ జాగ్రఫీ దాదాపుగా మూడో పేపర్లో కవర్ అవుతుంది.
- పర్యావరణ సమస్యలు సబ్జెక్టు ప్రాధాన్యత పెరిగింది. విపత్తు నిర్వహణకు మార్కుల వెయిటేజీ తగ్గింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టును కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ప్రిపేర్ కావాలి. రీజనల్ కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత పెరిగిందని అభ్యర్థులు గమనించాలి.
పేపర్ 2 (చరిత్ర, పాలిటీ, సమాజం)
పేపర్లో హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో పేపర్ 2 సిలబస్ గ్రూప్ 2 ,3 రెండింటికి ఒకటే కాని ఉద్యమం ఒక్కటే గ్రూప్2 లో 150 మార్కులకు ఉంటుంది.
కానీ గ్రూప్ 3లో 30 నుంచి 40 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈ పేపర్ కోసం గ్రాడ్యుయేషన్ స్థాయిలో చదవాలి.
పేపర్ 3 ( ఇండియా, తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి)
ఈ పేపర్లో మొత్తం మూడు సబ్జెక్టులుగా ఇండియా, తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి టాపిక్‌లు ఉన్నాయి. కొత్తగా ఇందులో జనాభా, బడ్జెట్, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలను చేర్చారు. గ్రూప్ 2, 3లో రెండింటిలో సిలబస్ పూర్తిగా ఒకే విధంగా ఉంటుంది.
పేపర్ 4 ( తెలంగాణ ఉద్యమం–రాష్ట్ర ఆవిర్భావం)
- గ్రూప్ 2లో ఒక పేపర్‌గా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది.
- గ్రూప్ 3లో రెండో పేపర్లో భాగంగా ఇస్తారు.
- గ్రూప్ 2 కు ఇచ్చిన ఉద్యమ చరిత్ర మీద ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అయితే గ్రూప్ 3లో ఈజీగా మార్కులు సాధించవచ్చు.
- గ్రూప్ 2, 3 పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నా, డిస్క్రిప్టివ్ విధానంలో చదివితే ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. ప్రశ్న ఎలా అడిగినా సమాధానం గుర్తించవచ్చు. గ్రూప్-2ని పకడ్బందీగా చదివితే గ్రూప్-3, ఇతర పరీక్షల్లో జనరల్ స్టడీస్ విభాగాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు.
I want socialigy