Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఇలా ప్రిపేరయితే.. గ్రూప్​ 2 గ్రూప్​ 3 రెండు జాబ్​లు కొట్టొచ్చు

ఇలా ప్రిపేరయితే.. గ్రూప్​ 2 గ్రూప్​ 3 రెండు జాబ్​లు కొట్టొచ్చు

సిలబస్ సేమ్​ ఉండడంతో.. గ్రూప్‌-2 గట్టిగా ప్రిపేరయితే అభ్యర్థులు గ్రూప్‌-3 సులభంగానే సాధించ వచ్చు. గ్రూప్​ 2, గ్రూప్​ 3 పరీక్షలో సిలబస్​ దాదాపు ఒకేలా ఉంటుంది. కామన్​ ప్రిపరేషన్​తో రెండు ఉద్యోగాలు సాధించే ఛాన్స్​ ఉంది. అందుకు ఎలా ప్రిపేర్​ కావాలి.. ఎలా చదవాలి.. ఏమేం కామన్​ ఉన్నాయి..? తెలుసుకుందాం.

Advertisement

REMINDER

గ్రూప్​ 2 అప్లికేషన్ ప్రాసెస్​ జనవరి 18 నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరి 16 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.

గ్రూప్​ 3 దరఖాస్తులు జనవరి 24 నుంచి మొదలవుతాయి. ఫిబ్రవరి 23 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

గ్రూప్​ 4 అప్లికేషన్లకు జనవరి 30వ తేదీ వరకు తుది గడువు ఉంది.

  • గ్రూప్​ 2 పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు. ప్రతి పేపర్​కు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు ఎగ్జామ్​ ఉంటుంది.
    • గ్రూప్ 3 లో మూడు పేపర్లు ఉండగా, ప్రతి పేపర్​కు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • ప్రస్తుతం ఉన్న ట్రెండ్​ అబ్జర్వ్​ చేస్తే టీఎస్​పీఎస్సీలో గ్రూప్​ 2,​ 3 పరీక్షలో 60శాతం మార్కులు సాధిస్తే కొలువు సాధించవచ్చు.
    • గ్రూప్​ 2, 3 సిలబస్​ దాదాపు సమానమే కాని, ముఖ్యమైన తేడా గ్రూప్​ 2 లో తెలంగాణ ఉద్యమం నుంచి 150 మార్కులు ఉంటే, గ్రూప్​ 3 లో పేపర్​ 2 లో భాగంగా ఉంటుంది. గ్రూప్​ 3లో తెలంగాణ ఉద్యమంలో 30 నుంచి 40 మార్కులు వచ్చే అవకాశం ఉంది.

పేపర్​ 1 (జనరల్​ స్టడీస్​ అండ్​ జనరల్​ ఎబిలిటీస్​)

  • సిలబస్​ ప్రకారం ఇందులో మొత్తం 11 టాపిక్​లు ఉన్నాయి. సిలబస్​ ఎక్కువ కావటంతో దీని ప్రిపరేషన్​కు ఎక్కువ టైమ్​ తీసుకుంటుంది. అందుకే మిగతా పేపర్లు చదివిన తర్వాతే, పేపర్​ 1 ప్రిపరేషన్​ మొదలు పెట్టాలి.
  • గ్రూప్​ 2,​ 3 రెండు ఎగ్జామ్స్​లోనూ పేపర్​ 1 సిలబస్​లో సేమ్​ టాపిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లిష్​ , అర్థమెటిక్​ అండ్​ రీజనింగ్, డేటా ఇంటర్​ ప్రిటేషన్​ పై ఎక్కువ ఫోకస్​ చేయాలి​. ఇంగ్లిష్​, మెంటల్​ ఎబిలిటి నుంచి సుమారు 40 నుంచి 50 మార్కుల మధ్య వచ్చే అవకాశం ఉంది. వీటి మీద కొంచెం ఎక్కువ దృష్టి పెడితే మొదటి పేపర్​లో మంచి మార్కులు సాధించవచ్చు.
  • తెలంగాణ రాష్ట్ర పాలసీలు తెలంగాణ ఎకానమీలోనూ కవర్​ అవుతాయి. సోషల్​ ఎక్సూక్లూజన్​, రైట్​ ఇష్యూస్​ మరియు ఇన్​క్లూజన్​ పాలసీలు పాలిటీలో భాగంగా ఉంటాయి. ‌‌
  • తెలంగాణ సొసైటీ, కల్చర్​, హెరిటేజ్​, కళలు, సాహిత్యానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి చెందినవి రెండో పేపర్​లో పూర్తిగా కవర్​ అవుతాయి.
  • ఇండియా హిస్టరీ అండ్​ కల్చరల్​ హెరిటేజ్​ సిలబస్​ దాదాపు పేపర్​ 1తో పాటు పేపర్​ 2లో భాగంగా ఉంటాయి. అంతర్జాతీయ కరెంట్​ అఫైర్స్​, సంబంధాలు, సంఘటనలు దాదాపు ఒక దానికొకటి లింక్​ ఉంటాయి.
  • వరల్డ్​ జాగ్రఫీకి సమకాలిన అంశాలు చదివితే సరిపోతుంది. ఇండియన్​ జాగ్రఫీకి సంబంధించి అట్లాస్​పై ఫోకస్​ చేయాలి. తెలంగాణ జాగ్రఫీ దాదాపుగా మూడో పేపర్​లో కవర్​ అవుతుంది.
  • పర్యావరణ సమస్యలు సబ్జెక్టు ప్రాధాన్యత పెరిగింది. విపత్తు నిర్వహణకు మార్కుల వెయిటేజీ తగ్గింది.
    సైన్స్ అండ్​ టెక్నాలజీ సబ్జెక్టును కరెంట్​ అఫైర్స్ లింక్​ చేస్తూ ప్రిపేర్​ కావాలి. రీజనల్​ కరెంట్ అఫైర్స్​ ప్రాధాన్యత పెరిగిందని అభ్యర్థులు గమనించాలి.

పేపర్​ 2 (చరిత్ర, పాలిటీ, సమాజం)

పేపర్​లో హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో పేపర్​ 2 సిలబస్​ గ్రూప్​ 2 ,3 రెండింటికి ఒకటే కాని ఉద్యమం ఒక్కటే గ్రూప్​2 లో 150 మార్కులకు ఉంటుంది.

కానీ గ్రూప్​ 3లో 30 నుంచి 40 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈ పేపర్​ కోసం గ్రాడ్యుయేషన్​ స్థాయిలో చదవాలి.

Advertisement

పేపర్​ 3 ( ఇండియా, తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి)

ఈ పేపర్​లో మొత్తం మూడు సబ్జెక్టులుగా ఇండియా, తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి టాపిక్​లు ఉన్నాయి. కొత్తగా ఇందులో జనాభా, బడ్జెట్​, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలను చేర్చారు. గ్రూప్ ​2, 3లో రెండింటిలో సిలబస్​ పూర్తిగా ఒకే విధంగా ఉంటుంది.

పేపర్​ 4 ( తెలంగాణ ఉద్యమం–రాష్ట్ర ఆవిర్భావం)

  • గ్రూప్​ 2లో ఒక పేపర్​గా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది.
  • గ్రూప్​ 3లో రెండో పేపర్​లో భాగంగా ఇస్తారు.
  • గ్రూప్​ 2 కు ఇచ్చిన ఉద్యమ చరిత్ర మీద ఫోకస్​ చేస్తూ ప్రిపేర్​ అయితే గ్రూప్​ 3లో ఈజీగా మార్కులు సాధించవచ్చు.
  • గ్రూప్​ 2, 3 పరీక్షలు ఆబ్జెక్టివ్​ విధానంలో ఉన్నా, డిస్​క్రిప్టివ్​ విధానంలో చదివితే ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. ప్రశ్న ఎలా అడిగినా సమాధానం గుర్తించవచ్చు. గ్రూప్‌-2ని పకడ్బందీగా చదివితే గ్రూప్‌-3, ఇతర పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌ విభాగాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!