తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నియామక పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 16వ తేదీ నుంచి కమిషన్ వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/) లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పరీక్షలను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మళ్లీ అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.
READ THIS: ఫ్రీగా గ్రూప్-2 కోచింగ్.. యువతకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. అప్లికేషన్ లింక్ ఇదే..

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 45 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా అభ్యర్థులు సాధ్యమైనంత త్వరగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్ పై ఉన్న సూచనలను చదువుకుని అనుసరించాని తెలిపారు.