Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఫ్రీగా గ్రూప్-2 కోచింగ్.. యువతకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. అప్లికేషన్ లింక్ ఇదే..

ఫ్రీగా గ్రూప్-2 కోచింగ్.. యువతకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. అప్లికేషన్ లింక్ ఇదే..

తెలంగాణలో మొత్తం 783 గ్రూప్-2 ఖాళీల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గత డిసెంబర్ 29న నోటిఫికేషన్ (TSPSC Group-2 Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 16ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పరీక్ష తేదీని మాత్రం ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (TS BC Study Circle) శుభవార్త చెప్పింది. ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Advertisement

ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ఈ నెల 12న ప్రారంభించగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. డిగ్రీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన జాబితాను ఈ నెల 21న ప్రకటిస్తారు. ఎంపికైన వారికి ఈ నెల 23 నుంచి ఉచిత శిక్షణను ప్రారంభించనున్నారు.

READ THIS: గ్రూప్-2 సిలబస్ లో తాజాగా చేసిన మార్పులివే.. కొత్త సిలబస్ PDF

తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు:
– అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షలలోపు ఉండాలి.
– మహిళలకు 33 శాతం సీట్లను కేటాయిస్తారు. ఇంకా బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 5 శాతం, ఇతరులకు (EBC, Orphans) 5 శాతం సీట్లను కేటాయిస్తారు.
– అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, కుల, ఆదాయ సర్టిఫికేట్లతో పాటు ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది.

READ THIS: గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజైంది.. జనవరి 18 నుంచి అప్లికేషన్లు.. పోస్టుల వివరాలు

– ప్రస్తుతం ఏదైనా రెగ్యులర్ కోర్సును చదువుతున్న వారు, ఉద్యోగం చేస్తున్న వారు దరఖాస్తుకు అనర్హులు.
– గతంలో ఏదైనా బీసీ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందిన వారు దరఖాస్తుకు అనర్హులు.
– అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/tsbcw/ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
– అభ్యర్థులు ఇతర వివరాలకు 040-24071178 నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ డైరెక్ట్ లింక్: https://studycircle.cgg.gov.in/tsbcw/TSBCGrpIIReg22.do

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!