Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 1 క్వాలిఫైడ్​ అభ్యర్థుల జాబితా పై టీఎస్​పీఎస్​సీ కీలక నిర్ణయం

గ్రూప్​ 1 క్వాలిఫైడ్​ అభ్యర్థుల జాబితా పై టీఎస్​పీఎస్​సీ కీలక నిర్ణయం

గ్రూప్ 1 ప్రిలిమ్స్​ క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాపై టీఎస్​పీఎస్​సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15న టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్​కు సంబంధించిన ఫైనల్​ కీని విడుదల చేసింది. ప్రిలిమినరీ కీతో పోలిస్తే.. ఎనిమిది ప్రశ్నలను మార్పులు చేసింది. అయిదు ప్రశ్నలను పూర్తిగా తొలగించగా.. మూడింటికి రెండేసి సమాధానాలు కరెక్టేనని ప్రకటించింది. దీంతో అభ్యర్థులందరూ తమకు ప్రిలిమ్స్​ లో ఎన్ని మార్కులు వస్తాయనే అంచనాల్లో మునిగితేలుతున్నారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు బదులు 1.034 మార్కుగా పరిగణించనుండటంతో.. దాదాపు 60 మార్కులపైనే జనరల్​ పోస్టులకు కటాఫ్​ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో అభ్యర్థులు టీఎస్​పీస్​సీ ప్రకటించే క్వాలిపై జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ.. హైకోర్టు కేసు కారణంగా ఈ జాబితా ఆలస్యమవుతుందని టీఎస్​పీఎస్​సీ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల్లో ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశముందని.. తదనుగుణంగా పోస్టుల కోటా రిజర్వేషన్లు మార్చాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆశాభావంతో ఉన్నారు.

మరోవైపు క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితా విషయంలో టీఎస్​పీఎస్​సీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్నటికే ఫైనల్​ కీ ప్రకటించినందున.. క్వాలిఫైడ్​ జాబితాను ప్రకటించకుండా నేరుగా అభ్యర్థులకు మెయిన్స్​ అడ్మిట్​ కార్డు ఇస్తే సరిపోతుందని భావిస్తోంది. జాబితాను ప్రకటించటం వల్ల ఉపయోగం లేదని.. యూపీఎస్​సీ తరహాలో అభ్యర్థులకు క్వాలిఫై లెటర్లు పంపించనున్నట్లు టీఎస్​పీఎస్​సీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. పోస్టుల రిజర్వేషన్లను బట్టి.. ఒక్కో పోస్టుకు 50 మందిని మెరిట్ ప్రకారం క్వాలిఫై చేస్తామని టీఎస్​పీఎస్​సీ ముందుగానే ప్రకటించింది. కోర్టు కేసుతో ముడిపడి ఉన్నప్పటికీ మరో పది రోజుల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్​లో క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ రెడీ అవుతుందని అంచనాగా చెబుతున్నారు. అభ్యర్థులు ఎవరికి వారుగా తమ రిజిస్ట్రేషన్​ నెంబర్​, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి.. క్వాలిఫైడ్​ ఫర్​ మెయిన్స్​ అడ్మిట్​ కార్డు పొందే వీలుంటుందని.. తాము క్వాలిఫై అయ్యారా.. లేదా.. దీని ద్వారానే తెలుసుకునే వీలుంటుంది. అంతకు మించి ప్రత్యేకంగా క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా వెబ్​సైట్​లో అందుబాటులో ఉండదని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు వెలువడగానే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్​పీఎస్​సీ వెల్లడించే అవకాశముంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!