టీఎస్పీఎస్సీ (TSPSC) ఈనెల 16న నిర్వహిస్తున్న గ్రూప్ 1 (GROUP 1) ప్రిలిమినరీ ఎగ్జామ్కు పూర్తి ఏర్పాట్లు చేసింది. 33 జిల్లా కేంద్రాల్లో 1,019 సెంటర్లలో పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనల జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు వీలుగా హెల్ప్ లైన్ (HELP LINE) ఏర్పాటు చేసింది. జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నెంబర్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ముగిసిన తర్వాత మూడురోజుల్లో ప్రాథమిక కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు టీఎస్పీఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20లోపు ‘కీ’ విడుదలయ్యేలా టెంటెటివ్ షెడ్యూలు సిద్ధం చేసింది. దానిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నిపుణుల కమిటీ ఫైనల్ ‘కీ’ని ప్రకటిస్తుంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను రెండు నెలల్లో ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ లెక్కన ఫిబ్రవరిలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి.

So use full bits