HomeLATESTస్కిల్​ యూనివర్సిటీలో మరో కోర్సు.. లెన్స్​ కార్ట్ తో ఒప్పందం

స్కిల్​ యూనివర్సిటీలో మరో కోర్సు.. లెన్స్​ కార్ట్ తో ఒప్పందం

తెలంగాణ యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్సిటీలో మరో కొత్త కోర్సు ప్రవేశపెడుతున్నారు. ప్రముఖ ఆప్టోమెట్రిక్​ సంస్థ లెన్స్​కార్ట్ యూనివర్సిటీ క్యాంపస్​లో ఆప్టోమెట్రిక్​ స్టోర్​ అసోసియేట్లకు ప్రత్యేక కోర్సు నిర్వహించనుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో 30 మంది విద్యార్థులకు నెల రోజుల పాటు శిక్షణను అందించనుంది. ఈ మేరకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) లెన్స్‌కార్ట్‌తో అవగాహన ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు లెన్స్​ కార్ట్ స్టోర్స్ లో ఉద్యోగాలు పొందవచ్చని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్​వీఎస్​ఎస్​ సుబ్బా రావు తెలిపారు.

లెన్స్‌కార్ట్, యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించారు. తమకు అవసరమైన నిపుణులైన ఉద్యోగులను సమకూర్చుకునేందుకు ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు లెన్స్​ కార్ట్ ప్రకటించింది. ఈ కొత్త జాబ్​ గ్యారంటీ కోర్సుతో విద్యార్థులు ఆప్టోమెట్రిక్ రంగంలో నైపుణ్యాలు సాధించటంతో పాటు లెన్స్‌కార్ట్‌లో వెంటనే ఉద్యోగాలు పొందే అవకాశముంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!