లేనిపోని అనుమానాలు.. ఊహగానాలు నమ్మవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి గ్రూప్ 1 అభ్యర్థులకు సూచించారు. గ్రూప్ 1 బంగారు అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని హితవు పలికారు. పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.
‘మీ సోదరుడిగా నా సూచన ఒక్కటే… పదేళ్లుగా వాయిదా పడుతున్న అన్ని ఉద్యోగాలను మన ప్రభుత్వంలో భర్తీ చేసుకుంటున్నాం.. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది తప్ప నియామకాలు చేపట్టలేదు… కొందరు స్వార్ధ రాజకీయ ప్రయోజనం కోసం నియామకాల భర్తీ జరగకుండా కుట్రలు చేస్తున్నారు.. అయినా అన్నింటినీ ఎదుర్కొని మేం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశాం.. గ్రూప్-1 విషయంలో నిరుద్యోగులకు ఎలాంటి అపోహలు నమ్మొద్దు.. జీవో 29 ప్రకారమే ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 ప్రకారం మెరిట్ ఆధారంగా మెయిన్స్ కు సెలెక్ట్ చేశాం. గ్రూప్-1 విషయంలో కొన్ని రాజకీయపార్టీలు వితండవాదం చేస్తున్నాయి. మధ్యలో నిబంధనలు మారిస్తే కోర్టులు పరీక్షల్ని రద్దు చేసిన దాఖలాలు ఉన్నాయి. జీవో 55 ప్రకారం భర్తీ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నష్టపోతారు. అందుకే అందరికీ న్యాయం జరగాలనే జీవో 29 ను ప్రభుత్వం తీసుకొచ్చింది. పదేళ్లు అధికారంలో ఉన్నపుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని వారు ఇవాళ మిమ్మల్ని దగ్గరికి పిలిస్తున్నారు. ఇది కొంగ జపం కాదా.. ఒక్కసారి ఆలోచించండి.గ్రూప్-1 అభ్యర్థులంతా మెయిన్స్ పరీక్షకు హాజరవండి.. లేకపోతే ఒక బంగారు అవకాశం కోల్పోతారు. న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని సమర్ధించాయి. ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి.. వారి ప్రాణాలు బలిగొని రాజకీయాల్లో ఉన్నత పదవులు అనుభవించారు. పదేళ్లలో వాళ్లు నిరుద్యోగులను కనీసం పట్టించుకోలేదు. నిరుద్యోగులారా.. మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దు. దయచేసి ఆందోళన విరమించండి.. అపోహలు వీడండి. అపోహల సంఘం మీ జీవితాలతో చెలగాటమాడాలనుకుంటుంది. వీళ్లు ఎలాంటి దుర్మార్గులో ఒకసారి నెమరు వేసుకోండి…‘ అన్నారు. ఆందోళనలో పాల్గొంటున్న నిరుద్యోగులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాళ్లందరూ గ్రూప్-1 అధికారులుగా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారని.. పోలీసులకు సూచించారు.
గ్రూప్ 1 ఒక బంగారు అవకాశం.. డోంట్ మిస్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS