పెడగాగి (సైకాలజీ) సబ్జెక్ట్ 30 మార్కులకు ఉంటుంది. ఈ సబ్జెక్ట్ డీఈడీ, బీఈడీ కోర్సులో భాగంగా టెట్ అభ్యర్థులు చదివి ఉంటారు. అయితే గతంలో పోలిస్తే ఈ సారి సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవు. పేపర్–1, పేపర్–2 వారికి దాదాపు ఒకే విధమైన సిలబస్ ఉన్నా.. ప్రశ్నల అడిగే స్థాయిలో తేడా ఉంటుంది. కొన్ని కాన్సెప్ట్‌లు మాత్రమే తేడా ఉంటాయి. తాజాగా వెలువడిన టెట్ –2022 నోటిఫికేషన్లో సిలబస్‌ను వెబ్సైట్లో పెట్టారు. దానిని అనుసరించి తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి పూర్తి సిలబస్ తెలుగులో మీకోసం…
- శిశు వికాసం–పెడగాగి
- పెరుగుదల, వికాసం, పరిపక్వత–భావన, స్వభావం వికాస నియమాలు–సూత్రాలు, అనువర్తనాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, జీవ,మనో, సామాజిక పరమైనవి.
- భాష మరియు వికాసం అంశాలు, శైశవ దశ, పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ, కౌమార దశ
- శిశు వికాసం అవగాహన, కోల్బర్గ్, చామ్స్కీ, కార్లరోజర్స్ ఎరిక్సర్
- వైయక్తిక బేధాలు, రకాలు, వైఖరులు, అభిరుచులు, ఆసక్తి, సహజ సామర్థ్యాలు, ఆలోచన, ప్రజ్ఞ, మాపనం
- మూర్తిమత్వ వికాసం, భావన, మూర్తిమత్వ వికాసం దానిపై ప్రభావం చూపే కారకాలు
- సర్దుబాటు, ప్రవర్తన సమస్యలు, మానసిక ఆందోళన, శిశువికాస అధ్యయనం, అంత:పరిశీలన, పరిశీలన, వ్యక్తి అధ్యయన, సంఘటనా రచనా ప్రశ్నావళి, ప్రయోగం, నిర్దారణ మాపని, ఇంటర్వ్యూ, తిర్యక్ అనుధైర్ఘ్య పరిశోధన పద్దతులు.
- వికాస కృత్యాలు, ఆటంకాలు
2.అభ్యసనం
- అభ్యసనం–భావన, స్వభావం–ప్రవేశం–ప్రక్రియ ఉత్పన్నం
- అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు–వ్యక్తిగత పరిసరాలు అభ్యసనం దాని అనుయుక్తములను వివరించు సిద్ధాంతాలు, ప్రవర్తనా వాదాలు, స్కిన్నర్, పావ్లోవ్, థార్న్‌డైక్ సిద్ధాంతాలు, నిర్మాణాత్మక వాదాలు, పియాజే, వైగాట్స్కీ, గెస్టాల్ద్, కొహెలర్, కోప్కా బండూరా పరిశీలన వాదాలు, అభ్యసన అంశాలు, సంజ్ఞనాత్మక, భావనాత్మక, ఫర్ఫార్మెన్స్
- ప్రేరణ దాని కొనసాగింపు, అభ్యసనంలో ప్రేరణ పాత్ర
- స్మృతి–విస్మృతి–అభ్యసన బదలాయింపు
- పెడగాగి
- బోధన మరియు అభ్యసనం–అభ్యాసకులతో దాని సంబంధం
*అభ్యసకునిపై సాంఘీక, రాజకీయ, సాంస్కృతిక సందర్భాల ప్రభావం
*విభిన్న సన్నివేశాల్లో పిల్లలు, ప్రత్యేక అవసరాల్లో పిల్లలు, విలీన విద్య - అభ్యసన అధ్యయన పద్దతులు–పరిశీలన ఆధారిత పద్ధతి, పరికల్పనా ఆధారిత పద్ధతి పరిశీలన మరియు కృత్యాధార పద్ధతి, సహకార మరియు సామూహిక పద్ధతి, వైయక్తిక మరియు సామూహిక అభ్యసనం, వ్యవస్థీకృత అభ్యసనం, తరగతి గది సమూహం
*వ్యవస్థీకృత అభ్యసనంలో బోధనా దృక్పథాలు, విషయ, ఉపాద్యాయ, విద్యార్థీ కేంద్రీకృత అభ్యసనం
*బ్రూనర్ బోధన సిద్ధాంతాలు
*బోధన ఒక ప్రణాళిక బద్దమైన కృత్యం బోధన ప్రణాళిక మూలకాలు - బోధన దశలు , సాధారణ శాస్త్రాల వారిగా ఉపాధ్యాయునికి ఉండాల్సిన నైపుణ్యాలు
- అభ్యసన సామర్థ్యాన్ని ప్రభావితం చేసే కారకాలు
- తరగతి గది నిర్వహణ, విద్యార్థి, ఉపాద్యాయుని పాత్ర, మార్గదర్శకత్వం, మంత్రణం, సమయపాలన, పిల్లల హక్కులు, దండనను ఉపయోగించడానికి న్యాయ అభ్యంతరం
- అభ్యసనం కొరకు మూల్యంకనం, అభ్యసన యొక్క మూల్యాంకనం బేధాలు, పాఠశాల ఆధారిత మూల్యంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం
- విద్యాహక్కు చట్టం 2009, బాలల హక్కులు మరియు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం–2005