టీఎస్‌ఆర్‌జేసీ(TSRJC)సెట్ అప్లికేషన్ల గడువు మరికొద్ది రోజులు పొడిగించారు. తెలంగాణలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2020-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌లో అడ్మిషన్లకు నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ (TSRJC) సెట్ దరఖాస్తుల గడువు మార్చి 31వ తేదీతో ముగిసింది. దాన్ని ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల సొనైటీ కార్యదర్శి సీహెచ్. రమణకుమార్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 15 జూనియర్ కాలేజీల్లో ఇంగ్లిష్ మీడియం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలో గురుకుల జూనియర్ కాలేజీల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ (ఇంగ్లీషు మీడియం – MPC/ BPC/MEC)లో అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 35 తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు మే 06న TSRJC-CET 2023 టెన్ట్ ను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్-2023లో టెన్త్ ఎగ్జామ్స్ కు హాజరవుతున్న తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులు http://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. దరఖాస్తుల గడువును ఏప్రిల్ 15వ తేదీ వరకు పొడిగించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సెలెక్షన్లు జరుగుతాయి. ఇతర వివరాలకు http://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ చూడాలి. లేదా 040-24734899 నంబర్లను సంప్రదించాలి.