HomeLATESTవారంలో తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల

వారంలో తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఫలితాల విడుదలకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం (ఫిబ్రవరి 4) తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఉద్యోగ నియామాలకు సంబంధించి ఫలితాల విడుదలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పరీక్షలు పూర్తయిన ఉద్యోగాలకు ఈ నెలలోనే ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 1, 2023 న నిర్వహించిన టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 4 పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీ, ఫైనల్ కీ విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణలో 8,180 గ్రూప్​ 4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్‌-1కు 7,62,872 మంది.. పేపర్-2 సెక్టటేరియల్​ ఎబిలిటీస్‌కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మూడు నెలల క్రితమే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల కావాల్సి ఉండగా.. ఎన్నికల సందర్భంగా అవి వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడింది. అంతే కాకుండా.. టీఎస్‌పీఎస్సీని కూడా ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేసేసింది. చైర్మన్‌తో సహా సభ్యుల వరకు అందరినీ కొత్త వారిని ఎంపిక చేసింది. దీంతో.. పెండింగ్ ఫలితాలను విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది.

వారంలో ఫలితాలు

ఫిబ్రవరి 3వ తేదీన రాత్రి సీడీపీఓ (చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్) పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. వీటితో పాటు ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు సంబంధించి ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ను కూడా విడుదల చేసింది. అయితే.. చాలా కాలంగా గ్రూప్ 4 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే.. సమాంతర రిజర్వేషన్లపై ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర్వులిచ్చిన 7- నుంచి 10 రోజుల్లో ఉద్యోగ ఫలితాలను ప్రకటించాలని నియామక సంస్థలకు ప్రభుత్వం సూచించింది. దీంతో టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 4 , ఏఈ, ఏఈఈ, గురుకులాల్లో వివిధ పోస్టుల ఫలితాలను వారం రోజుల్లో ప్రకటించేందుకు బోర్డులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

2 COMMENTS

  1. Sir, Group 4 GRL issue meeda meeru ichina information sources officials nunchi vachinda sir?
    Because we are waiting for GRL since October.
    We have a faith on merupu news.
    Because meeru ichina news prakaram grl after elections annaru. But tspsc prakshalana meeru first time information icharu regarding GRL
    So idhi authentic aa kada ani doubt sir

    Pls reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!