తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టీఎస్పీఎస్సీ (TSPSC) మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అగ్రికల్చర్ ఆపీసర్ పోస్టులతో పాటు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్లు జారీ చేసింది. అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ విభాగంలో 148 ఏవో పోస్టులను భర్తీ చేయనుంది. ఖాళీగా ఉన్న 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 37 పోస్టులు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో 91 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన భర్తీ చేయనుంది.
అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 10వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జనవరి 30 వ తేదీ వరకు అప్లికేషన్ల తుది గడువుగా టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్లో www.tspsc.gov.in త్వరలోనే డిటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల రిక్రూట్మెంట్కు సంబంధించి జనవరి 6వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు అప్లై చేసుకోవాలని టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.


