Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSBIG BREAKING: రెండు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్​పీఎస్​సీ

BIG BREAKING: రెండు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్​పీఎస్​సీ

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. టీఎస్​పీఎస్​సీ (TSPSC) మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అగ్రికల్చర్​ ఆపీసర్‌‌ పోస్టులతో పాటు ఫిజికల్​ డైరెక్టర్​ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్లు​ జారీ చేసింది. అగ్రికల్చర్​ అండ్ కో ఆపరేటివ్​ విభాగంలో 148 ఏవో పోస్టులను భర్తీ చేయనుంది. ఖాళీగా ఉన్న 128 ఫిజికల్​ డైరెక్టర్​ పోస్టులను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనుంది. టెక్నికల్​ ఎడ్యుకేషన్​ పరిధిలో 37 పోస్టులు, ఇంటర్మీడియట్​ ఎడ్యుకేషన్ లో 91 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ పద్ధతిన భర్తీ చేయనుంది.

Advertisement

అగ్రికల్చర్​ ఆఫీసర్​ పోస్టులకు జనవరి 10వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్లో అప్లై చేసుకోవాలి. జనవరి 30 వ తేదీ వరకు అప్లికేషన్ల తుది గడువుగా టీఎస్​పీఎస్​సీ నిర్ణయించింది. టీఎస్పీఎస్​సీ అఫిషియల్​ వెబ్​సైట్​లో www.tspsc.gov.in త్వరలోనే డిటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ​

ఫిజికల్​ డైరెక్టర్​ పోస్టుల రిక్రూట్​మెంట్​కు సంబంధించి జనవరి 6వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు అప్లై చేసుకోవాలని టీఎస్​పీఎస్​సీ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!