గ్రూప్-3 పరీక్షల సిలబస్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఇందులో మొత్తం మూడు పేపర్లు ఉన్నాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటల టైమ్ కేటాయించారు. ఇటీవలే 1,365 గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు TSPSC ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్
పేపర్-1 | జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ మొత్తం 150 మార్కులు |
పేపర్-2 | తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశాలకు 50 మార్కులు భారత రాజ్యాంగం 50 మార్కులు, భారత చరిత్రకు 50 మార్కులు.. మొత్తం 150 మార్కులు |
పేపర్-3 | భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో మార్పులు అంశాలు.. మొత్తం 150 మార్కులు |