గ్రూప్ 4 (GROUP 4) పరీక్షకు సంబంధించి (TSPSC) టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్లతో తప్పులను సవరించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుండి 15 వరకు అప్లికేషన్లలో ఎడిట్ ఆప్షన్ కి అవకాశం ఇచ్చినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జూలై 1వ తేదీన గ్రూప్ 4 పరీక్ష జరుగనుంది.
ఇటీవలి రిక్రూట్‌మెంట్‌లన్నింటా అప్లికేషన్లలో అభ్యర్థులు తరచుగా తప్పులు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ గుర్తించింవి. బయో డేటాలోనూ తప్పులు నమోదు చేసి దిద్దుబాటుకు అవకాశం ఇవ్వాలని చాలా మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీని ఆశ్రయించటం తరచుగా జరుగుతోంది. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్ మరియు జూనియర్ ఆడిటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న గ్రూప్ 4 అభ్యర్థులు వీటిని గుర్తించాలి. అప్లికేషన్లను సరిగ్గా ఫిలప్ చేయటం అభ్యర్థుల బాధ్యత. అందుకే గ్రూప్ 4 అభ్యర్థులు తమ అప్లికేషన్లను చెక్ చేసుకొని.. తప్పులను సవరించుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా పూరించడం అభ్యర్థి బాధ్యత.
అభ్యర్థులు ఈ ఎడిట్ ఆఫ్షన్‌ను ఒకేసారి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అందుకే, అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అభ్యర్థులు ఎడిట్ ఆఫ్షన్‌ను ఉపయోగించుకున్న తర్వాత అప్లికేషన్లలో ఉన్న డేటా ఫైనల్‌గా పరిగణించబడుతుంది. తదుపరి దిద్దుబాట్లకు అవకాశం ఉండదని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
