Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 4 పై టీఎస్​పీఎస్​సీ తాజా ప్రకటన

గ్రూప్​ 4 పై టీఎస్​పీఎస్​సీ తాజా ప్రకటన

గ్రూప్​ 4 (GROUP 4) పరీక్షకు సంబంధించి (TSPSC) టీఎస్​పీఎస్​సీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్లతో తప్పులను సవరించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుండి 15 వరకు అప్లికేషన్లలో ఎడిట్ ఆప్షన్ కి అవకాశం ఇచ్చినట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. జూలై 1వ తేదీన గ్రూప్ 4 పరీక్ష జరుగనుంది.

Advertisement

ఇటీవలి రిక్రూట్‌మెంట్‌లన్నింటా అప్లికేషన్లలో అభ్యర్థులు తరచుగా తప్పులు చేస్తున్నట్లు టీఎస్​పీఎస్​సీ గుర్తించింవి. బయో డేటాలోనూ తప్పులు నమోదు చేసి దిద్దుబాటుకు అవకాశం ఇవ్వాలని చాలా మంది అభ్యర్థులు టీఎస్​పీఎస్​సీని ఆశ్రయించటం తరచుగా జరుగుతోంది. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్ మరియు జూనియర్ ఆడిటర్​ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న గ్రూప్​ 4 అభ్యర్థులు వీటిని గుర్తించాలి. అప్లికేషన్లను సరిగ్గా ఫిలప్​ చేయటం అభ్యర్థుల బాధ్యత. అందుకే గ్రూప్​ 4 అభ్యర్థులు తమ అప్లికేషన్లను చెక్​ చేసుకొని.. తప్పులను సవరించుకునేందుకు టీఎస్​పీఎస్​సీ అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా పూరించడం అభ్యర్థి బాధ్యత.

అభ్యర్థులు ఈ ఎడిట్​ ఆఫ్షన్​ను ఒకేసారి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అందుకే, అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అభ్యర్థులు ఎడిట్​ ఆఫ్షన్​ను ఉపయోగించుకున్న తర్వాత అప్లికేషన్లలో ఉన్న డేటా ఫైనల్‌గా పరిగణించబడుతుంది. తదుపరి దిద్దుబాట్లకు అవకాశం ఉండదని టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!