పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రశ్నాపత్రం లీకైనట్లుగా తేలడంతో ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కమిషన్. మొత్తం 837 పోస్టులకు ఈ నెల 5న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
