తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. రవాణ శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఈ ఎడిట్ ఆప్షన్ అధికారిక వెబ్ సైట్ లో ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అభ్యర్థులకు ఒక సారి మాత్రమే తమ దరఖాస్తు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.