గ్రూప్ 4 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ (TSPSC GROUP 4) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తంగా 9,168 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ డిసెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీల పోస్టులు ఉన్నాయి.
ఈ పరీక్షను జులై 1న ఓఎమ్ ఆర్ పద్ధతిలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనలో తెలిపింది. 300 మార్కులకు నిర్వహించే ఈ ఎగ్జామ్ను ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పేపర్, మద్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు సెక్రటేరియల్ ఎబిలిటీ పేపర్ నిర్వహించనున్నారు.
