తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. 5 నోటిఫికేషన్ల కు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ డిపార్ట్మెంట్లో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించిన నియామక పరీక్షను ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.
- డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 18 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పరీక్షను మే 7 నిర్వహించనున్నారు.

- ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల 247 ఉద్యోగాలకు సంబంధించిన నియామక పరీక్షను మే 13న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
- టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఇంటర్ ఎడ్యుకేషన్ కమిషనర్ పరిధిలో 128 ఫిజికల్ ఎడ్యుకేటర్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షను మే 17న నిర్వహించనున్నట్లు తెలిపింది టీఎస్పీఎస్సీ.
- ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ల పరిధిలోని 71 లైబ్రేరియన్ ఫోస్టులకు సంబంధించిన నియామక పరీక్షను మే 17న నిర్వహించనున్నట్లు తెలిపింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.