తెలంగాణ పాలిసెట్ (TS POLYCET 2023) ప్రవేశ పరీక్షను మే 17వ తేదీన నిర్వహించనున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు అధికారులు ప్రకటించారు. ఈ ఎంట్రన్స్‌లో వచ్చిన మార్కులు, మెరిట్ ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో నీట్లను భర్తీ చేయనున్నారు.
పాలిసెట్ అప్లికేషన్ల నమోదు గడువు (ఈనెల 25వ తేదీ) మంగళవారం నాటితో ముగిసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేయని విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
విద్యార్థులు రూ.200 లేట్ ఫీజు చెల్లించి మే 14వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు వీలుగా గడువును పొడిగించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాలిసెట్ ఎంట్రన్స్ మే 17వ తేదీన జరుగనుంది. ఈ పరీక్ష ముగిసిన తర్వాత పది రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించనున్నారు.