తెలంగాణ జెన్కోలో 339 అసిస్టెంట్ ఇంజనీర్ (ASSISTANT ENGINEER) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటితో పాటు 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 339 ఏఈ పోస్టుల్లో విభాగాల వారీగా ఎలక్ట్రికల్‌లో 187, మెకానికల్‌లో 77, ఎలక్ట్రానిక్స్‌లో 25, సివిల్‌లో 50 పోస్టులు భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్‌మెంటర్ సైన్స్‌లో ఎంఎస్సీ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులైన వారు కెమిస్ట్ పోస్టులకు అర్హులు. ఈనెల 7వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. అప్లికేషన్లకు చివరి గడువు తేదీ అక్టోబర్ 29. పూర్తి వివరాల పీడీఎఫ్ ఇక్కడ అందుబాటులో ఉంది. అఫిషియల్ వెబ్సైట్ tsgenco.co.in
జెన్కోలో 339 ఏఈ పోస్టులు..60 కెమిస్ట్ జాబ్స్.. ఎల్లుండి నుంచే అప్లికేషన్లు
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS