తెలంగాణ పోలీసు ఉద్యోగాల దరఖాస్తులకు మరో రెండు వారాలు గడువుంది. జులై చివరి వారంలో లేదా ఆగస్టు రెండో వారంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని TSLPRB భావిస్తోంది. ముందుగా సబ్ ఇన్స్పెక్టర్ (SI) ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎస్ఐ పరీక్ష తర్వాత రెండు వారాల వ్యవధిలో కానిస్టేబుల్ (CONSTABLE), ఇతర ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. కొందరు అభ్యర్థులు అటు ఎస్ఐ తో పాటు కానిస్టేబుల్ పోస్టులు రెండింటీకీ సెలెక్ట్ అవుతున్నారు. దీంతో కానిస్టేబుల్ పోస్టుల్లో బ్యాక్ లాగ్ మిగిలిపోతున్నాయి. అందుకే ముందుగా ఎస్ఐ పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.
ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించిన రిజల్ట్స్ ను సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు వీలుగా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఎస్ఐ, కానిస్టేబుల్, వివిధ విభాగాల్లో ప్రకటించిన ఉద్యోగాలకు అప్లికేషన్ల గడువు ఈనెల 20వ తేదీన ముగియనుంది.
ఈ గడువు ముగిసిన తర్వాత క్వశ్చన్ పేపర్ల తయారీ, ముద్రణకు నెలన్నర టైమ్ పడుతుందని.. జులై చివరి వారం లేదా ఆగస్టు రెండో వారంలో ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.
ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్ రాసేందుకు మరోసారి అప్లికేషన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ డిటైల్స్ అప్డేషన్కు మరో 45 రోజులు పడుతుంది. అందుకే అక్తోబర్-నవంబర్ మధ్య ఈవెంట్స్ నిర్వహించేందుకు వీలుగా టెంటేటివ్ షెడ్యూలును బోర్డు తయారు చేసుకుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ డిసెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం మధ్య నిర్వహించే అవకాశాలున్నాయి. దీని ప్రకారం సెలక్షన్ లిస్టు 2023 ఫిబ్రవరి, మార్చిలో వెలువడుతుంది.
ఎస్ఐ తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్.. రిజల్ట్స్ సెప్టెంబర్లో
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS
Very good
Very nice
thank you
Exam
Hi
Iam studying for ps
Very nice
Sir I am full interest in police job sir I have a police job sir give me police job sir plrase
Thank u for u r kind information
And I don’t have clarity about negative marks please tell me about it
Very good please follow schedule
Hi ple message me
SSC constable result from gopal
P.maheah
Iam going job police 18 yera old
My passion is to become police or Army man