HomeLATESTఎస్​ఐ తర్వాత కానిస్టేబుల్​ ​ఎగ్జామ్​.. రిజల్ట్స్​ సెప్టెంబర్​లో

ఎస్​ఐ తర్వాత కానిస్టేబుల్​ ​ఎగ్జామ్​.. రిజల్ట్స్​ సెప్టెంబర్​లో

తెలంగాణ పోలీసు ఉద్యోగాల దరఖాస్తులకు మరో రెండు వారాలు గడువుంది. జులై చివరి వారంలో లేదా ఆగస్టు రెండో వారంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని TSLPRB భావిస్తోంది. ముందుగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (SI) ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామ్​ నిర్వహిస్తారు. ఎస్​ఐ పరీక్ష తర్వాత రెండు వారాల వ్యవధిలో కానిస్టేబుల్‌ (CONSTABLE), ఇతర ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామ్​ ఉంటుంది. కొందరు అభ్యర్థులు అటు ఎస్​ఐ తో పాటు కానిస్టేబుల్​ పోస్టులు రెండింటీకీ సెలెక్ట్ అవుతున్నారు. దీంతో కానిస్టేబుల్​ పోస్టుల్లో బ్యాక్ లాగ్ మిగిలిపోతున్నాయి. అందుకే ముందుగా ఎస్​ఐ పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.

ప్రిలిమినరీ ఎగ్జామ్​కు సంబంధించిన రిజల్ట్స్ ను సెప్టెంబర్‌ చివరి వారంలో రిలీజ్​ చేసేందుకు వీలుగా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఎస్​ఐ, కానిస్టేబుల్​, వివిధ విభాగాల్లో ప్రకటించిన ఉద్యోగాలకు అప్లికేషన్ల గడువు ఈనెల 20వ తేదీన ముగియనుంది.

ఈ గడువు ముగిసిన తర్వాత క్వశ్చన్​ పేపర్ల తయారీ, ముద్రణకు నెలన్నర టైమ్​ పడుతుందని.. జులై చివరి వారం లేదా ఆగస్టు రెండో వారంలో ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు బోర్డు ఛైర్మన్​ వివి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.

ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్​ రాసేందుకు మరోసారి అప్లికేషన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ డిటైల్స్​ అప్​డేషన్​కు మరో 45 రోజులు పడుతుంది. అందుకే అక్తోబర్‌-నవంబర్‌ మధ్య ఈవెంట్స్​ నిర్వహించేందుకు వీలుగా టెంటేటివ్​ షెడ్యూలును బోర్డు తయారు చేసుకుంది. ఎస్​ఐ, కానిస్టేబుల్​ మెయిన్​ ఎగ్జామ్​ డిసెంబర్‌ రెండో వారం నుంచి నాలుగో వారం మధ్య నిర్వహించే అవకాశాలున్నాయి. దీని ప్రకారం సెలక్షన్​ లిస్టు 2023 ఫిబ్రవరి, మార్చిలో వెలువడుతుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

15 COMMENTS

  1. Sir I am full interest in police job sir I have a police job sir give me police job sir plrase

  2. Thank u for u r kind information
    And I don’t have clarity about negative marks please tell me about it

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!