కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా తెలంగాణలో గవర్నమెంట్ కాలేజీలు ఈసారి ఇంటర్ ఫలితాల్లో పోటీ పడ్డాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్, సెకండియర్ టాపర్ల వివరాలను వేర్వేరుగా తయారు చేసింది.
సెకండియర్‌కు సంబంధించి ఎంపీసీ విభాగంలో హుజుర్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివిన ఎస్వీ వైష్ణవి దేవి 991 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచింది. బైపీసీ విభాగంలో ఖమ్మంలోని ఏఎస్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి చెందిన తప్పేట రోహిణి 990 మార్కులతో టాపర్‌గా నిలిచింది.
పస్ట్ ఇయర్‌కు సంబంధించి ఎంపీసీ విభాగంలో పెద్దపల్లి జూనియర్ కాలేజీలో చదివిన ఊట్ల సాయి అమూల్య 465 మార్కులతో టాపర్‌గా నిలిచింది. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ గవర్నమెంట్ కాలేజీలో చదివిన రాధారపు శ్రీనిధి 434 మార్కులతో బైపీసీ విభాగంలో టాపర్ గా నిలిచింది.
INTER SECOND YEAR TOPPERS 2023

INTER FIRST YEAR TOPPERS 2023
