గురుకుల్ పోస్టులకు నిర్వహిస్తున్న పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో వివిధ పోస్టుల రిక్రూట్మెంట్కు భారీ సంఖ్యల్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. TREIRB నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను treirb.telangana.gov.in అఫిషియల్ వెబ్సైట్లో బోర్డు అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతం ఆర్ట్ క్రాఫ్ట్, మ్యూజిక్ తదితర పోస్టుల హాల్ టికెట్లు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచింది. పీజీటీ, టీజీటీ హాల్ టికెట్లు మరో రెండు, మూడు రోజుల్లో వెబ్సైట్లో పెడుతామని బోర్డు అధికారులు తెలిపారు. అభ్యర్థులు వెంటనే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని, పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వరకే హాల్ టికెట్లు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని టీఆర్ఈఐఆర్బీ కన్వీనర్ ఇటీవలే ప్రకటన విడుదల చేశారు. అందుకే అభ్యర్థులు ఆలస్యం చేయకుండా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొని భద్రపరుచుకోవాలి.

