తెలంగాణలో డీఎస్సీకి శనివారంతో అప్లికేషన్ల గడువు ముగిసింది. మొత్తం 176527 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 తేదీ నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించారు. ఈ గడువు (అక్టోబర్ 28) శనివారంతో ముగిసింది. 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షల తేదీలను మార్చిన విషయం తెలిసిందే. వాయిదాపడ్డ ఈ డీఎస్సీ పరీక్షలు 2024 జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటివారంలో నిర్వహించే అవకాశాలున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
