తెలంగాణ డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిశాయి. మొత్తం 1,76,530 దరఖాస్తులు అన్ని జిల్లాల నుంచి వచ్చాయి. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా 60,190 అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా అదే నెల 20వ తేదీ నుంచి కూడా ఆన్ లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కాగా దరఖాస్తుల గడువు ఈ నెల 21తో ముగిసింది. అయితే అభ్యర్థుల వినతి మేరకు ఈ గడువును మరో వారం పాటు పొడిగించారు. పొడిగించిన దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. గడువు తేదీ ముగిసిన తర్వాత మొత్తంగా 1,79, 297 మంది అభ్యర్థుల ఫీజు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు 1.76లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. ఇక డీఎస్సీ పరీక్షలను జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే వీలుందని అధికారులు చెబుతున్నారు.
