తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-2 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే డిసెంబర్ 15, 16 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు ఒకరోజు ముందు వరకు అంటే డిసెంబర్ 14వ తేదీ వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. అందుకే అభ్యర్థులు ఆలస్యం చేయకుండా ముందుగానే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
డిసెంబర్ 15వ తేదీ
ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 (చరిత్ర, పాలిటీ, సొసైటీ),
డిసెంబర్ 16వ తేదీన
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-3 (ఎకానమి అండ్ డెవెలప్మెంట్ ),
మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్షలు జరుగుతాయి.
అర గంట ముందే అభ్యర్థులు పరీక్ష హాల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదయం పరీక్షలకు
ఉదయం 9.30 గంటలకు.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు అభ్యర్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్షలకు అనుమతించబోరని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అన్ని పరీక్షలకు ఒకే హాల్‌టికెట్‌ను వినియోగించాలని తెలిపింది.

