హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించింది. శుక్రవారం రాత్రి ఫైనల్ కీతో పాటు జనరల్ ర్యాకింగ్ లిస్టును ప్రకటించింది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేస్తారు.
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు మొత్తం 81,931 మంది అభ్యర్థుల ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. వార్డెన్ అండ్ మ్యాట్రన్ పోస్టులకు 497 మందితో కూడిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబరు 22న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. రాత పరీక్షలు జూన్ 24 నుంచి జూన్ 29 వరకు జరిగాయి. మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు ఈ పరీక్షలు జరిగాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లో తమ ఫలితాలను చెక్ చేసుకోవాలి.
