
తెలంగాణ టెట్ (TSTET 2024) అభ్యర్థులు ఈరోజు (బుధవారం) నుంచి హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు టెట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాగా తొలిసారిగా ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉదయం, మధ్యాహ్నం, సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.
ఎగ్జామ్ ప్యాటర్న్: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. జనరల్ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్‌టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.
Allticket download
Haku ticket