HomeLATESTతెలంగాణ గ్రూప్​ 1 టాపర్లు వీరే

తెలంగాణ గ్రూప్​ 1 టాపర్లు వీరే

తెలంగాణ గ్రూప్​ 1 ఫలితాల్లో పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడ్డారు. టాప్​ 50 ర్యాంకుల్లో 25 మంది, తొలి వంద ర్యాంకుల్లో 41 మంది మహిళలున్నారు.

హైదరాబాద్​కు చెందిన లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్​ సాధించారు. మెయిన్స్​ పరీక్షల్లో 900 మార్కులకు లక్ష్మీ దీపిక 550 మార్కులు సాధించారు. ఉస్మానియాలో ఎంబీబీఎస్​ పూర్తి చేసిన లక్ష్మీ దీపిక గతంలోనే ఎంపీడీవో సెలెక్టయ్యారు. రెండు సార్లు యూపీఎస్​సీ ఇంటర్వ్యూ కు సెలెక్టయ్యారు.

నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. ఆరేండ్లుగా సివిల్​ సర్వీసెస్‌కు ప్రిపేరవుతున్న వెంకటరమణ.. గ్రూప్‌-1 ఫస్ట్ అటెంప్ట్ లోనే సత్తా చాటడం విశేషం. ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన జూనియర్‌ లెక్చరర్‌ సివిక్స్‌ పోస్టుకు, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఎంపికయ్యారు. గ్రూప్‌-2లో 378వ ర్యాంకు సాధించారు.

మల్టీ జోన్‌-1 కేటగిరీలో టాపర్‌గా హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్వినిరెడ్డి (532.5 మార్కులు) నిలిచారు. మొత్తం మీద నాలుగో ర్యాంకు సాధించారు. ఆమె ప్రస్తుతం మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.

ర్యాంక్​హాల్ టికెట్ నంబర్పేరుమార్కులు
1240946218లక్ష్మీ దీపిక550
2240920349వెంకట రమణ535.5
3240907150535.5
4240911068తేజస్విని రెడ్డి532.5
5240918455కృతిక532.0
6240911138పూనాటి హర్షవర్ధన్​525.5

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట కార్పొరేషన్‌ జిల్లెలగూడకు చెందిన సిద్ధాల కృతిక గ్రూపు-1లో 532 మార్కులతో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. నాలుగు సార్లు సివిల్స్‌ కు ప్రయత్నించిన కృతికకు మంచి ర్యాంకు రాలేదు. ఇటీవల గ్రూప్‌-4లో 511వ ర్యాంకు సాధించి వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగంలో చేరారు. తాజాగా గ్రూప్‌-1లో రాష్ట్రస్థాయి ఐదో ర్యాంకు సాధించారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన పూనాటి హర్షవర్ధన్‌ గ్రూప్‌-1లో  రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు, మల్టీ జోన్‌-2 స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. బిట్స్‌ పిలానీ లో ఇంజనీరింగ్​ చదివిన హర్షవర్ధన్​ రూ.27 లక్షల వార్షిక వేతనంతో ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం మానేసి సివిల్ప్​కు ప్రిపేరవుతున్నాడు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!