తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET 2024) ప్రిలిమినరీ కీ విడుదలైంది. మే 20న ప్రారంభమైన టెట్ పరీక్షలు పది రోజుల పాటు జరిగాయి. జూన్ 2వ తేదీన పూర్తయ్యాయి. పరీక్షలు ముగిసిన మరుసటి రోజే విద్యాశాఖ అధికారులు ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్స్‌ను విడుదల చేశారు. పేపర్ల వారీగా ప్రిలిమినరీ కీని టెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. టెట్ తుది ఫలితాలు జూన్ 12న విడుదల కానున్నాయి. టెట్ పేపర్-1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. పేపర్-1కి 86.03 శాతం మంది, పేపర్-2కి 82.58 శాతం మంది హాజరయ్యారు.
టెట్ 2024 ప్రిలిమినరీ కీ
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS