పదో తరగతిలో 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 1.47 శాతం పెరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో 94.21 శాతం, గురుకుల పాఠశాలల్లో 98.7 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో పదవ తరగతి (Telangana SSC) పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. పదవ తరగతి ఫలితాలను ఇప్పటి వరకు మార్కులు కాకుండా మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇచ్చేవారు. ఈ సారి మెమోలపై గ్రేడ్లకు బదులుగా సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్ మార్కులు, ఎక్స్ టర్నల్ మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇచ్చారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరయ్యారు.
ఇందులో 4,96,374 మంది రెగులర్ విద్యార్థులు కాగా, 10,733 మంది ప్రైవేట్ అభ్యర్థులు.
ప్రధాన ఫలితాలు
- మొత్తం ఉత్తీర్ణత శాతం (రెగులర్ విద్యార్థులు): 92.78%
- బాలురు: 91.32%
- బాలికలు: 94.26% (బాలురతో పోలిస్తే 2.94% అధికం)
- ప్రైవేట్ అభ్యర్థులు ఉత్తీర్ణత శాతం: 57.22%
- బాలురు: 55.14%
- బాలికలు: 61.70% (బాలురతో పోలిస్తే 6.56% అధికం)
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
- పరీక్షలు తేదీలు: జూన్ 3 నుండి జూన్ 13, 2025 వరకు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు జరుగుతాయి.
- ఫీజు చెల్లింపు తుది తేదీలు:
- పాఠశాలలో ఫీజు చెల్లింపు – 16.05.2025
- ఆన్‌లైన్‌లో ఫీజు అప్లోడ్ – 17.05.2025
📄 Telangana SSC (10th Class) Results 2025
Check your Telangana SSC Results 2025 using your hall ticket number. Results were announced on April 30, 2025, at 1 PM.
How to check your result:
- Click on any one of the links above.
- Enter your Hall Ticket Number.
- Click submit to view your marks.
Note: If one site is slow or not opening, try another link. Results are also available via SMS/WhatsApp as per instructions on the official site.
జిల్లాల వారీగా ఫలితాలు
- అత్యధిక ఉత్తీర్ణత: మహబూబాబాదు జిల్లా – 99.29%
- తక్కువ ఉత్తీర్ణత: వికారాబాదు జిల్లా – 73.97%
100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు
- మొత్తం 4,629 పాఠశాలలు పూర్తి ఉత్తీర్ణత సాధించాయి.
విషయాల వారీగా ఉత్తీర్ణత
- తెలుగు మీడియం విద్యార్థుల ఉత్తీర్ణత: 83.46%
- ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు: 94.01%
- మాతృభాష, గణితం, సైన్స్, సామాజిక శాస్త్రాల్లో ఉత్తీర్ణత శాతం 96-99% మధ్యలో ఉంది.
రీకౌంటింగ్/రివెరిఫికేషన్ కోసం
రీ వెరిఫికేషన్ ఫీజు: ₹1000
విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేది: 15 మే, 2025
ప్రతి సబ్జెక్ట్‌కు రీకౌంటింగ్ ఫీజు: ₹500