హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, సెక్రటరీ కార్యాలయం 2022-2023 విద్యాసంవత్సరానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ), జనరల్ అండ్ ఒకేషనల్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది.
అర్హత: మార్చి 2022లో పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,50,000 మించరాదు.
వయసు: 31 ఆగస్టు 2022 నాటికి 17 ఏండ్లకు మించరాదు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఓఎంఆర్ పద్ధతిలో 150 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.
సబ్జెక్ట్ మార్కులు
మ్యాథ్స్ 30 మార్కులు
ఫిజికల్ సైన్స్ 30 మార్కులు
బయో సైన్స్ 30 మార్కులు
సోషల్ స్టడీస్ 30 మార్కులు
ఇంగ్లిష్ 15 మార్కులు
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 15 మార్కులు
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: రూ.100 చెల్లించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 25 జనవరి
హాల్ టికెట్స్ డౌన్‌లోడ్: 8 ఫిబ్రవరి నుంచి 19 ఫిబ్రవరి 2022.
ఎగ్జామ్: 20 ఫిబ్రవరి
వెబ్సైట్: www.tsswreisjc.cgg.gov.in
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్స్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS