HomeLATESTవిప్రోలో ఫ్రెషర్స్​కు జాబ్స్.. జీతం 3.50 లక్షలు

విప్రోలో ఫ్రెషర్స్​కు జాబ్స్.. జీతం 3.50 లక్షలు


దేశంలోని ప్రముఖ సాఫ్ట్​వేర్​ సంస్థ విప్రో 2022 సంవత్సరానికి గాను ఎలైట్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ 2.0 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రెషర్‌ ఇంజినీరింగ్‌ (2020, 2021, 2022) గ్రాడ్యుయేట్స్‌కి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.

పోస్టు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌

అర్హత: బీఈ/ బీటెక్‌ (తప్పనిసరి డిగ్రీ)/ ఎంఈ/ ఎంటెక్‌ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు) ఉత్తీర్ణత. ఫ్యాషన్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ బ్రాంచులు మినహాయించి, మిగిలిన అన్ని బ్రాంచుల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బీఈ/ బీటెక్‌లో 60 శాతం/ ఆపైన మార్కులు సాధించి ఉండాలి.
2020, 2021, 2022 ఇంజినీరింగ్‌ అభ్యర్థులు అర్హులు.

వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

సాలరీ: ఏడాదికి రూ.3.50 లక్షలు చెల్లిస్తారు. జాయినింగ్‌ కాంపన్సెషన్‌ కింద రూ.3,50,000 అందజేస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌లైన్‌ ఎసెస్‌మెంట్‌ – బిజినెస్‌ డిస్కషన్ – లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్ఓఐ) – ఆఫర్‌ లెటర్‌ ఈ విధంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌ ఎసెస్‌మెంట్‌ పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. పరీక్షా సమయం 128 నిమిషాలు ఉంటుంది.

ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌: లాజికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ (వర్బల్‌) పరీక్షా సమయం 48 నిమిషాలు.

రిటన్‌ కమ్యూనికేషన్​ టెస్ట్‌: ఎస్సే రైటింగ్‌ పరీక్షా సమయం 20 నిమిషాలు
ప్రోగ్రామింగ్‌ టెస్ట్‌: జావా, సీ, సీ++/ పైథాన్‌ వీటీలో ఏదో రెండు ప్రోగ్రాముల్లో కోడింగ్ రాయాలి. 60 నిమిషాలు.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.
చివరి తేది: 31 జనవరి
నోటిఫికేషన్: https://careers.wipro.com/elite

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!