HomeLATESTఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు​ మెమోలు: ఆన్​లైన్​లో పెట్టిన ఇంటర్​ బోర్డు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు​ మెమోలు: ఆన్​లైన్​లో పెట్టిన ఇంటర్​ బోర్డు

ఇంటర్ ఫస్ట్ ఈయర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ మినిమమ్ పాస్ మార్కుల తో పాస్ చేసినట్లు ఇంటర్​ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో మినిమమ్ మార్క్స్ తో విద్యార్థులందరన్ని పాస్ చేసినట్టు బోర్డు ప్రకటించింది. ఈ నెల 7 వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఇంటర్​ ఫస్ట్ ఇయర్​ మెమోలను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఇంటర్​ బోర్డు సెక్రెటరీ ఒమర్​ జలీల్​ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

రీ-వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ (RVRC) కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ,తమ రీ-వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ కోసం చేసుకొన్న దరఖాస్తును రద్దు చేసుకోవచ్చని ప్రకటించింది. రీ-వెరిఫైడ్/రీకౌంటింగ్ కు ఆసక్తి చూపకపోతే.. బోర్డు వెబ్​సైట్​ https://tsbie.cgg.gov.in ద్వారా తమ అప్లికేషన్‌లను రద్దు చేయడానికి 7వ తేదీ సాయంత్రం నుంచి ఆప్షన్​ ఇచ్చుకునే సదుపాయం అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఉపసంహరించుకునే ఆప్షన్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 17.

RVRC అప్లికేషన్లను రద్దు చేసుకున్న విద్యార్థులు తమకు ఇప్పటికే చెల్లించిన ఫీజును బోర్డు తిరిగి చెల్లిస్తుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యార్థులు తాము చదివిన కాలేజీ ప్రిన్సిపాళ్ల నుంచి ఈ డబ్బును తిరిగి పొందవచ్చని ఇంటర్​ బోర్డు ప్రకటించింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!