Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణ హైకోర్టులో 150 సివిల్ జడ్జి పోస్టులు

తెలంగాణ హైకోర్టులో 150 సివిల్ జడ్జి పోస్టులు

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసులో జూనియర్ విభాగంలో సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 150 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనిలో 2024 సంవత్సరానికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 31 ఖాళీలు, బదిలీ ద్వారా 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2024,2025 సంవత్సరాలకు గాను డైరెక్టు రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 90ఖాళీలు, బదిలీల ద్వారా 14ఖాళీలు భర్తీ చేస్తారు.

తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలున్నావారు మే 17లోగా ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. స్క్రీనింగ్ టెస్ట్ రాత పరీక్ష , వైవా-వాయిస్ టెస్ట్ ద్వారా సెలక్ట్ చేస్తారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్,ఖమ్మంలో పరీక్షను నిర్వహిస్తారు.

జూనియర్ సివిల్ జడ్జీ పోస్టులు:

మొత్తం ఖాళీల సంఖ్య: 150.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా: 31 పోస్టులు

ట్రాన్స్‌ఫర్ ద్వారా : 15 పోస్టులు

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) ద్వారా : 90 పోస్టులు

ట్రాన్స్‌ఫర్ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) ద్వారా: 14 పోస్టులు

అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ లా డిగ్రీ చేసి ఉండాలి. 3ఏండ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసినవారు అర్హులు. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలన్నీ ఉండాలి.

వయస్సు:
అభ్యర్థుల వయస్సు 10.04.2024 నాటికి 23 – 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5ఏళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు 10ఏళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు:
రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా సెలక్ట్ చేస్తారు.

పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ (సీబీటీ)ఉంటుంది. పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నలకు ఒకమార్కు ఉండగా… పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది.

-స్క్రీనింగ్ పరీక్షలో 40శాతం లేదా ఆపై మార్కులు సాధించిన అభ్యర్థుల్లో 1:10 నిష్పత్తిలో రాతపరీక్షకు ఎంపికచేస్తారు. మొత్తం 3 పేపర్లకు (సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్)రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 100మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ పేపర్‌లో 25 మార్కులకు ట్రాన్స్‌లేషన్, 75 మార్కులు ఎస్సే రైటింగ్.. ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి వ్యాసాలు రాయాలి.

-రాతపరీక్షలో కనీస అర్హత మార్కులను ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 శాతంగా బీసీలకు 55 శాతంగా, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 50 శాతంగా (ఒక్కో పేపరులో కనీసం 45 శాతం మార్కులుగా నిర్ణయించారు.

వైవా-వాయిస్:
మొత్తం 30 మార్కులకు వైవా-వాయిస్ పరీక్షను నిర్వహిస్తారు.ఈ పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలి. లేని యెడల పరిగణలోనికి తీసుకోరు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:3 నిష్పత్తిలో వైవా-వాయిస్‌కు అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. అర్హత మార్కులుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు, ఇతరులు 50 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు జీతం రూ.77,840 నుంచి రూ. 1,36,520 ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 17.05.2024.

స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభం: 08.06.2024.

కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 16.06.2024.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!