గ్రూప్ 4 ఉద్యోగాలకు ఈసారి భారీగా పోటీ నెలకొంది. మొదటి ఏడు రోజుల్లోనే ఒక లక్షా 55 వేల మంది అభ్యర్థులు తమ అప్లికేషన్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,039 పోస్టుల భర్తీకి గ్రూప్ 4 నోటిఫికేషన్ వెలువడింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజున అప్లికేషన్ల ప్రక్రియ ఆలస్యం కావటంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. అదే రోజు అర్ధరాత్రి 11.45 నుంచి అప్లికేషన్ల రిజిస్ట్రేషన్ విండోను టీఎస్పీఎస్సీ (TSPSC) ఓపెన్ చేసింది.
దీంతో మొదటి రోజున కేవలం ఒకే ఒక అభ్యర్థి అప్లికేషన్ నమోదైంది. మరుసటి రోజు నుంచి వరుసగా అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టులకు ఇంటర్ విద్యార్హత ఉండేది. ఈ అర్హతను డిగ్రీకి పెంచినప్పటికీ.. లక్షలాది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జనవరి 30వ తేదీ వరకు గ్రూప్ 4 అప్లికేషన్ల నమోదుకు గడువు ఉంది. దీంతో ఈసారి అప్లికేషన్ల సంఖ్య అంచనాలకు మించిపోతుందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.

Hai sir good morning my no wts app group lo add avvatam ledhu sir plz once check sir and add my number tspsc notifications