Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 4కు ఊహించనంత పోటీ.. వారంలో లక్షన్నర అప్లికేషన్లు

గ్రూప్​ 4కు ఊహించనంత పోటీ.. వారంలో లక్షన్నర అప్లికేషన్లు

గ్రూప్‌ 4 ఉద్యోగాలకు ఈసారి భారీగా పోటీ నెలకొంది. మొదటి ఏడు రోజుల్లోనే ఒక లక్షా 55 వేల మంది అభ్యర్థులు తమ అప్లికేషన్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,039 పోస్టుల భర్తీకి గ్రూప్​ 4 నోటిఫికేషన్​ వెలువడింది. డిసెంబర్​ 30వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజున అప్లికేషన్ల ప్రక్రియ ఆలస్యం కావటంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. అదే రోజు అర్ధరాత్రి 11.45 నుంచి అప్లికేషన్ల రిజిస్ట్రేషన్​ విండోను టీఎస్​పీఎస్​సీ (TSPSC) ఓపెన్​ చేసింది.

Advertisement

దీంతో మొదటి రోజున కేవలం ఒకే ఒక అభ్యర్థి అప్లికేషన్​ నమోదైంది. మరుసటి రోజు నుంచి వరుసగా అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్​ 4 పోస్టులకు ఇంటర్​ విద్యార్హత ఉండేది. ఈ అర్హతను డిగ్రీకి పెంచినప్పటికీ.. లక్షలాది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జనవరి 30వ తేదీ వరకు గ్రూప్​ 4 అప్లికేషన్ల నమోదుకు గడువు ఉంది. దీంతో ఈసారి అప్లికేషన్ల సంఖ్య అంచనాలకు మించిపోతుందని టీఎస్​పీఎస్​సీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!