HomeLATESTడీఎస్సీ ఫలితాల కోసం వెయిటింగ్​.. వారంలో వచ్చే చాన్స్​

డీఎస్సీ ఫలితాల కోసం వెయిటింగ్​.. వారంలో వచ్చే చాన్స్​

సెప్టెంబరు 6వ తేదీన డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షల ఫైనల్​ ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. దాంతో డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్‌ మార్కులను కలిసి జిల్లాల వారీగా జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌)ను ఇవ్వాల్సి ఉంది. ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుది కీ విడుదల సమయంలో విద్యాశాఖ వెల్లడించింది.

డీఎస్సీ తుది కీ విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్‌ వివరాలు గతంలో తప్పులతడకగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారని వెల్లడైంది. దాంతో ఆ వివరాల సవరణకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రక్రియ కూడా ఈ నెల 13వ తేదీతో ముగిసింది. జీఆర్‌ఎల్‌ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరిట్‌ జాబితాను డీఈవోలకు పంపించాల్సి ఉంటుంది. కానీ, జీఆర్‌ఎల్‌ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఫైనల్​ ‘కీ’ వెల్లడైన తర్వాత పలువురు డీఎస్సీ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాల్లో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించామని.. వాటికి మార్కులు ఇవ్వలేదని ఆయా అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆఫీస్​ వచ్చి చెప్పారు. అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావొచ్చని విశ్వసనీయ సమాచారం.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!