HomeLATESTతెలంగాణ బడ్జెట్​ 2024–2025

తెలంగాణ బడ్జెట్​ 2024–2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం తెలంగాణ బడ్జెట్​ రూ.2,91,159 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26.216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లుగా, ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.297.42 కోట్లుగా అంచనా వేశారు.

బడ్జెట్‌ కేటాయింపులు

➤ సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు.

➤ విద్యాశాఖకు రూ.21,292 ​కోట్లు.

➤ ప్రజాపంపిణీకి రూ.3836 కోట్లు

➤ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం.

➤ ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.

➤ వైదారోగ్య శాఖకు రూ.11468 కోట్లు.

➤ ఓఆర్‌ఆర్‌కు రూ.200 కోట్లు.

➤ సంక్షేమానికి రూ.40వేల కోట్లు.

➤ రోడ్లు, భవనాలకు రూ.5790 కోట్లు.

➤ ఐటీ శాఖకు రూ.774 కోట్లు.

➤ హార్టీకల్చర్‌కు రూ.737 కోట్లు.

➤ పరిశ్రమల శాఖకు రూ.2762 కోట్లు.

➤ ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 ​కోట్లు.

➤ గృహజ్యోతికి రూ.2418 కోట్లు.

➤ 500 రూపాయల ‍గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు.

➤ అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.

➤ ఎస్టీ సంక్షేమానికి రూ.17056 కోట్లు.

➤ ట్రిపుల్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు రూ.1525 కోట్లు.

➤ ఎస్సీ సంక్షేమానికి రూ.33.124 కోట్లు

➤ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు.

➤ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌కు రూ.500 కోట్లు.

➤ హెచ్‌ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు.

➤ పశుసంవర్థక శాఖకు రూ.1980 కోట్లు.

➤ విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.

➤ స్త్రీ శిశు సంక్షేమశాఖకు రూ.2736 కోట్లు.

➤ ఓల్డ్‌ సిటీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు.

➤ హోంశాఖకు రూ.9564 కోట్లు.

➤ పంచాయతీరాజ్‌ శాఖకు రూ.29,816 కోట్లు.

➤ బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు.

➤ మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు.

➤ మెట్రోవాటర్‌ వర్క్స్‌ కోసం రూ.3385 కోట్లు.

➤ కొత్త ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు.

➤ మొత్తం హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు.

➤ అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.

➤ విద్యుత్‌ శాఖకు రూ.16,410 కోట్లు.

➤ రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు.

➤ ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు.

➤ మహాలక్ష్మి ఉచిత రవాణాకు రూ.723కోట్లు.

➤ మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు.

➤ ఎస్సీ, ఎస్టీ గృహ లబ్ధిదారులకు రూ.6 లక్షల సాయం.

➤ మల్టీ మోడల్‌ సబర్బన్‌ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టంకు రూ.50 కోట్లు.

➤ ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లు.

➤ ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లు.

➤ రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!