స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
అర్హత: పోస్టును అనుసరించి సీఏ/ సీఎఫ్ఏ, ఏదైనా డిగ్రీ, పీజీ డిప్లొమా/ సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, బృంద చర్చలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి. వివరాలకు www.sbi.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.