రాష్ట్ర శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక (సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2023)ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ రంగాల పరిస్థితులను ఇందులో విశ్లేషించారు.
2022-23లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 13.1 లక్షల కోట్లు కాగా 2023-24 లో 14.6 లక్షల కోట్లకు చేరుకున్నది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 11.9 శాతం పెరిగింది. జాతీయ స్థాయిలో పెరుగుదలను (9.1శాతం) పరిగణనలోకి తీసుకుంటే 2.8శాతం అధికంగా ఉంది.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 14.2 శాతం, ఉత్తర ప్రదేశ్ 12.8 శాతం ఉండగా తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. 2023-24లో స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ)లో తెలంగాణ వాటా 5 శాతంగా ఉంది.
తెలంగాణ సామాజిక అర్ధిక సర్వే 2014
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS