యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వామీ రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్‌లో తెలంగాణాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆటోమొబైల్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, ఎలక్ట్రిషియన్, సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్, టైలరింగ్‌లో శిక్షణ పొందడానికి టెన్త్, ఐటీఐ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 ఏళ్ల నుంచి 35 మధ్య ఉండాలి.
తప్పనిసరిగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఆపేసిన వారు అనర్హులు. అప్లికేషన్ చేసేందుకు అభ్యర్థుల ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీల సెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్, రూ.250 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫారాలను నేరుగా స్వామీ రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కార్యాయలంలో సమర్పించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ ఫిబ్రవరి 14 సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు 9133908000, 9133908111, 9948466111 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
