ఇండియన్ నేవీ 2025 షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోర్సులో అడ్మిషన్స్ – అప్లై చేయండి సెప్టెంబర్ 29లోగా
ఇండియన్ నేవల్ అకాడమీ (INA) 2025 జూన్ నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది. సెప్టెంబర్ 29, 2024 లోగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
ఇండియన్ నేవీ SSC పోస్టులు
మొత్తం 250 పోస్టులు అందుబాటులో ఉన్నాయి:
- జనరల్ సర్వీస్ (GS-X/ హైడ్రో క్యాడర్): 56
- పైలట్: 24
- నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (ఎయిర్ క్రూ): 21
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 20
- లాజిస్టిక్స్: 20
- నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్: 16
- ఎడ్యుకేషన్: 15
- ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 36
- ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 42
అర్హతలు
ఇండియన్ నేవీ SSC కోర్సులో చేరడానికి అభ్యర్థులు కింద పేర్కొన్న విద్యార్హతలు మరియు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి:
- సంబంధిత విభాగంలో B.Sc., B.Com., B.E., B.Tech., M.Tech., MBA, MCA, PG డిప్లొమా ఉత్తీర్ణత అవసరం.
- ఎంపిక ప్రాసెస్‌లో అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం మరియు ఇతర ప్రయోజనాలు
ఇండియన్ నేవీ SSC లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 వేతనం అలాగే ఇతర అలవెన్సులు అందిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
అభ్యర్థులు సెప్టెంబర్ 29, 2024 లోగా ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.