దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో అడ్మిషన్స్‌కు సంబంధించి ‘జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025’ దరఖాస్తు గడువు సోమవారం (సెప్టెంబర్ 23)తో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం తొలుత సెప్టెంబర్ 16వ తేదీనే దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ.. పొడిగించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న జరుగనుంది. ఫలితాలు మార్చి నెలలో వెల్లడి కానున్నాయి. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 23లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చేసుకోవచ్చు.
ఎంపికైతే 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్
ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులు 2024–-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు www.navodaya.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.