కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది (2024-25)లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీల చార్ట్ విడుదల చేసింది. దీంట్లో 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు నిర్వహించే గ్రేడ్-సి స్టెనోగ్రాఫర్, దిల్లీ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్, సీఏపీఎఫ్, జూనియర్ ఇంజినీర్, మల్టీ టాస్కింగ్ సిబ్బంది, హవల్దార్ (సీబీఐసీ& సీబీఎన్), కానిస్టేబుల్ (జీడీ) తదితర ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్, అప్లికేషన్ల గడువు, పరీక్షల తేదీలను ప్రకటించింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చు. పరీక్షల క్యాలెండర్ ఇక్కడ చూడొచ్చు. అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో అందుబాటులో ఉంది.

గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్, జేఎస్ఏ/ఎల్డీసీ, ఎస్ఎస్ఏ/యూడీసీ పరీక్షల ప్రకటన జనవరిలో వెలువడుతుంది. ఏప్రిల్ మే నెలలో పరీక్షలు జరుగుతాయి. ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, 2024లో సబ్-ఇన్‌స్పెక్టర్, జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) ఎగ్జామ్ మే, జూన్‌లో నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 14న ముగుస్తుంది. జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్‌లు) నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 29న నోటిఫికేషన్ వెలువడుతుంది.
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఏప్రిల్‌లో విడుదల అవుతుంది. జూన్ లేదా జూలైలో పరీక్ష నిర్వహిస్తారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2024 సెప్టెంబర్-అక్టోబర్‌లో జరుగుతుంది, అయితే మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ అండ్ హవల్దార్ (CBIC & CBN) పరీక్ష జూలై-ఆగస్టులో జరుగుతుంది. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, గ్రేడ్ ‘సి’, ‘డి’ స్టెనోగ్రాఫర్ పరీక్ష అక్టోబర్, నవంబర్‌లో నిర్వహిస్తారు. అస్సాం రైఫిల్స్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), NIA, SSF, రైఫిల్‌మ్యాన్ (GD)లో కానిస్టేబుల్స్ (GD) స్థానాలకు పరీక్షలు వచ్చే ఏడాది డిసెంబర్, 2025 జనవరిలో జరుగుతాయి.
Note : SSC GD కి అప్లై చేయబోయే అభ్యర్థులు తమ OBC/EWS Certificate లు కొత్తగా తీసుకున్నవి అందుబాటులో ఉంచుకోవాలి. 2023 లో తీసుకొని ఉంటే పర్లేదు.. అంతకంటే పాతది చెల్లుబాటు కాదు. డిసెంబర్ 28 లోపు ఈ సర్టిఫికెట్లు రెడీగా ఉంచుకోవాలి.
ఎస్ ఎస్సీ పరీక్షల క్యాలెండర్ కు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చెక్ చేసుకోండి.