తెలంగాణలో గురుకుల పోస్టుల పీఈటీ నియామకాలకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందులో ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్ పీఎస్సీ కమిషన్ రిలీజ్ చేసింది. 1:2 నిష్పత్తి ప్రకారం మొత్తం 1185 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు 29-05-2024 నుంచి 04-06-2024 వరకు హైదరాబాద్ లోని టీఎస్ పీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఉందని తెలిపింది.
మే 28 నుంచి జూన్ 4 వరకు వెబ్ ఆప్షన్స్ అందుబాటులో ఉండనున్నాయి. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీల్లో పీఈటీ ఖాళీలకు గాను 2017 సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎస్ పీఎస్సీ చర్యలు చేపట్టింది.